బహుజన రాజకీయ ఉద్యమం ఖమ్మం నుండే ప్రారంభం కావాలి
- ఖమ్మంలో బీసీ ఎమ్మెల్యే, ఎంపీ లేక పోవడం బాధాకరం
- బీసీ రిజర్వేషన్, బహుజన రాజ్యాధికార సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బహుజన రాజకీయ ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభం కావాలని ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో
ఖమ్మం జిల్లా నుండి ఎమ్మెల్యే , ఎంపీలుగా బీసీలను
గెలిపించుకొని తీరుతామని అన్నారు. మంగళవారం పొడకండి రాంబాబు అధ్యక్షతన ఖమ్మంలో పూలే
అంబేద్కర్ అధ్యయన వేదిక బీసీ రిజర్వేషన్, బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహించింది. సదస్సుకు ముఖ్య
అతిధిగా హాజరైన మల్లన్న మాట్లాడుతూ ఖమ్మం భౌతిక పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా
లేదని అన్నారు .60 శాతం ఉన్న బీసీలు నేటి వరకు శాసన సభకు రాజ్యసభకు వెళ్లకపోవడం
బాధాకరమన్నారు. ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కమ్మ రెడ్ల పార్టీలు కావటం వల్ల
ఇంత నష్టం జరిగిందన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆది నుండి నేటి వరకు
బీసీల రాజ్యంలోనే ప్రజల బతుకులు మారాయని, అగ్రకుల రాజ్యంలో దళిత బహుజన జాతులు ఆత్మగౌరవం లేకుండా
బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు . అన్ని సమస్యలకు పరిష్కారం బహుజన రాజ్యమేనని చెప్పారు.
ఖమ్మం ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని, బహుజన రాజ్య ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
ఈ సదస్సులో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు డి రాజారామ్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ
చైర్మన్ ఆర్ జె సి కృష్ణ , బీసీ టు స్టేట్ ప్రజెంట్ సుంకర శ్రీను , బీసీ జేఏసీ రాష్ట్ర
నాయకులు ఒట్టే జానయ్య యాదవ్ , ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి నాసరయ్య , బీసీ జేఏసీ నాయకులు
పాల్వంచ రామారావు , మున్నూరు
కాపు రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ , ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు లింగన్న
బోయిన లక్ష్మణ్ , ఎల్
హెచ్ బి ఎస్ నాయకులు భద్ర నాయక్ , పెళ్లూరి విజయ్ కుమార్, పి ఆర్ దేవి, టీవీ రాజు, పల్లెపు సోమరాజు
తదితరులు పాల్గొన్నారు .

Comments
Post a Comment